Aussies beat NZ: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా 141 పరుగులతో ఘనవిజయం సాధించింది. వెల్లింగ్టన్ లోని బేసిన్ రివర్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఈ పెర్రీ-68; తహిలా మెక్ గ్రాత్-57; గార్డెనర్-48; మూనీ, హేన్స్ చెరో 30 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో తహుహు మూడు; హన్నా రో, మాకీ, అమేలియా కేర్ర్, జేన్సేన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన కివీస్ మహిళలు వరుస వికెట్లు కోల్పోయారు. అమీ సత్తార్ వైట్-44; తహుహు-23; కాటీ మార్టిన్-19; సుజీ బేట్స్-16 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. కివీస్ 30.2 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు; అమందా వెల్లింగ్ టన్, గార్డెనర్ చెరో రెండు; పెర్రీ, మెక్ గ్రాత్, మేగాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన పెర్రీ కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.