హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని పేర్కొంటూ.. దాఖలైన పిటిషన్లన్నీఈ రోజు కొట్టేసింది. కర్ణాటక నుంచి మొదలై.. దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచంలోనూ హాట్ టాపిక్‌గా మారింది హిజాబ్ వ్యవహారం. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను అనుమతించలేదు కర్ణాటక ప్రభుత్వం. ఈ అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న.. కర్ణాటక హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
మంగళవారం తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి అవసరమైన ఆచారం కాదంది. ఫిబ్రవరి 5 నాటి ప్రభుత్వ ఉత్తర్వును చెల్లుబాటయ్యేలా కేసు నమోదు చేయలేదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. స్కూల్ యూనిఫాం ప్రిస్క్రిప్షన్ అనేది సహేతుకమైన పరిమితి అని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరని వ్యాఖ్యానించింది.
ఇక హిజాబ్ తీర్పు నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. హిజాబ్ వివాదం మొదలైన.. ఉడుపిలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.