5 States Congress Pcc Presidents Resign :
కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. పార్టీ వరుస ఓటములతో నాయకత్వ మార్పు కోసం కొందరు డిమాండ్ చేసిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం అత్యవసరంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై సొనియాగాంది నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసింది. పార్టీలో క్రమశిక్షణ కొరవడింది. అంతర్గత కుమ్ములాటలు, వర్గ పోరు తగ్గక పోగా మరింత పెరుగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉన్న పంజాబ్ లో వర్గపోరు దారుణమైన ఓటమికి దారితీసింది. దీంతో పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఇటీవల ఎన్నికలు జరిగి పార్టీ ఓటమి పాలైన 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాల్సిందేనన్నారు. సంస్థాగతంగా మార్పులు చేసి పార్టీని పటిష్టం చేయాలని సోనియా యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే సోనియా రాజీనామాలు కోరారని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. అయితే పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధు ఇప్పటికే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో మార్పుల కోసం ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో నాయకత్వ మార్పు కోసం కొందరు సీనియర్లు పట్టుబడుతున్న తరుణంలో సోనియా నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది..
ఇవి కూడా చదవండి: కాంగ్రెస్ ఓటమిలో బి జె పి గెలుపు