Wednesday, November 27, 2024
HomeTrending Newsనేటి నుంచే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్

నేటి నుంచే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్

వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందడుగు వేసింది. దేశ వ్యాప్తంగా నేటి నుంచి 12 నుంచి 14 చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయానుంది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ రూపొందించిన కొర్బివ్యాక్స్ అనే టీకాతో 12 – 14 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందు కోసం కేంద్ర ప్రభుత్వం.. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది.టీకా పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే 60 ఏళ్లు పై బడిన వారికి కూడా నేటి నుంచి బూస్టర్ డోస్ ను సైతం ఇవ్వనున్నారు. కాగ తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 ఏళ్ల లోపు దాదాపు 17 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. వారికి టీకాలను పంపిణీ చేయడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే కొర్బివ్యాక్స్ టీకాలను అన్ని జిల్లాలకు పంపించారు.అలాగే 12 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు కొర్బివ్యాక్స్ టీకాను 0.5 ఎంఎల్ ను ఒక్క డోసుగా ఇవ్వనున్నారు. రెండు డోజు కోసం 28 రోజుల వ్యవధి ఉంచాలని అధికారులు సూచించారు. అలాగే టీకా తీసుకున్న తర్వాత.. పిల్లలను దాదాపు గంట పాటు పరిశీలనలోనే ఉంచాలని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్