తెలంగాణలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుని ఒంటి పూట బడులు నడపాలని నిర్ణయించింది.. ఈ నెల 16 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించాలని అన్ని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. ఏప్రిల్ 23 తేదీ వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ వివరించింది.
ఇదిలాఉండగా కొన్ని పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుంది, ప్రభుత్వం 12 లేక 12.30 వరకు బడులు నడపాలని నిర్ణయించగా, హైద్రాబాద్, ఆబిడ్స్ లో ని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఒంటి పూట అర్దంనే మార్చేసింది.. మిట్టమధ్యాహ్నం 2గంటలవరకు తరగతులను నడుపుతోంది, ఇదేంటని యాజమాన్యాన్ని అడిగితే పట్టించుకోకుండ సమయం మార్చడం కుదరదని మొండికేస్తుoది, మొత్తం తెలంగాణ రాష్ట్రం లో అన్ని పాఠశాలలు 12.30 వరకు నడుపుతుంటే ,లిటిల్ ఫ్లవర్ స్కూల్ మాత్రం మిట్ట మధ్యాహ్నం రెండు గంటలవరకె నడుపుతానంటుంది, ఆ స్కూల్ యాజమాన్యo విద్యా శాఖ పై పెత్తనం చాలయిస్తుందని ఆ స్కూల్ ని ఎవరేమి అనరని అందికే ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా నడుపుతారని కొందరు తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు, పిల్లల ఆరోగ్యాలపై ఆందోళవ్యక్తం చేస్తూ ,తమ పిల్లలకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు
ఇవి కూడా చదవండి: తెలంగాణలో ఒంటిపూట బడులు