Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్:  ఇండియాపై ఇంగ్లాండ్ గెలుపు

మహిళల వరల్డ్ కప్:  ఇండియాపై ఇంగ్లాండ్ గెలుపు

England Won: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియాపై  ఇంగ్లాండ్ విజయం సాధించింది. బ్యాటింగ్ లో పేలవమైన ప్రదర్శన తో  134 పరుగులకే  ఇండియా ఆలౌట్ అయ్యింది.  ఇంగ్లాండ్ ఈ లక్ష్యాన్ని 31.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది. ఇంగ్లడ్ బౌలర్  ఛార్లెట్టె  డీన్ నాలుగు వికెట్లతో రాణించింది.

మౌంట్ మంగనూయీలోని బే ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 18 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ (యస్తికా భాటియా-8) కోల్పోయింది, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ స్మృతి మందానా-35; రిచా ఘోష్-33; గోస్వామి-20; హార్మన్ ప్రీత్ కౌర్-14  మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 36.2 ఓవర్లలో 134 పరుగులకే ఇండియా ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో డీన్ నాలుగు; శ్రుభ్ సోల్ రెండు; ఎక్సెల్ స్టోన్, కేట్ క్రాస్ చెరో వికెట్ పడగొట్టారు.

తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు బ్యూమోంట్- వ్యాట్ చెరో పరుగు మాత్రమే చేసి ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ హెదర్ నైట్, స్కైవర్ లు మూడో వికెట్ కు 65పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  నైట్-53; స్కైవర్-45 పరుగులు చేశారు.  ఇండియా బౌలర్లలో మేఘన సింగ్ మూడు; గోస్వామి, గైక్వాడ్, పూజా వస్త్రాకర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ తొలి విజయం నమోదు చేసింది.

నాలుగు వికెట్లతో సత్తా చాటిన డీన్ కే  ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్