Sunday, November 24, 2024
HomeTrending Newsవిభజన హామీల సంగతి ఏంటి?

విభజన హామీల సంగతి ఏంటి?

Your Promises? ముందు విభజన హామీలను నెరవేర్చిన తరువాత బిజెపి నేతలు మాట్లాడాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సలహా ఇచ్చారు.  ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ తో సహా విభజన హామీలను బీజేపీ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. నిన్న కడపలో బిజెపి నిర్వహించిన  రాయలసీమ రణభేరి లో అ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఉనికి కోసమే బీజేపీ రాయలసీమ జపం చేస్తోందని మండిపడ్డారు.  బీజేపీ నేతలు  చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

రాయలసీమకు ఎటువంటి న్యాయం చేయకుండా.. కడప లో భారతీయ జనతా పార్టీ నాయకులు రాయలసీమ రణభేరి పేరిట సభ పెట్టడం ఉంది

ఇంతకాలానికి రాయలసీమ ప్రజలు బిజెపి నాయకులకు గుర్తుకు వచ్చారా…?

రాయలసీమపై అంత ప్రేమ ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిది

జలయజ్ఞం ద్వారా పోతిరెడ్డిపాడు పూర్తి చేసి సీమ జిల్లాలకు సాగునీటిని అందించారు

కేవలం బిజెపి, తమ ఉనికిని కాపాడుకునేందుకే ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు…

విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చి, ఆ తర్వాత బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు.

కడప  స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీ ఏమైంది..? దాని గురించి బిజెపి నేతలు ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేదు?

రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తోంది. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పై ముందు నుంచి ఒకే తాటిపైకి వచ్చి హోదా కోసం పోరాడుతూనే ఉంది. హోదానే రాష్ట్రానికి సంజీవని.

జంగారెడ్డిగూడెం మృతుల విషయంలో చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేశారు..

మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి, ఊరూరా మద్యాన్ని అమ్మించిన ఘనత చంద్రబాబుది…

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు…?

RELATED ARTICLES

Most Popular

న్యూస్