Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: ఇంగ్లాండ్ అద్భుత విజయం

మహిళల వరల్డ్ కప్: ఇంగ్లాండ్ అద్భుత విజయం

Thriller match: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఆతిథ్య న్యూజిలాండ్ పై అద్భుత విజయం సాధించింది. నాలుగు వికెట్లకు 176 పరుగుల స్కోరుతో ఉన్న ఇంగ్లాండ్ గెలుపు లాంచనమే అనుకున్నారు. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. కివీస్ బౌలర్లు జేస్ కేర్ర్, మాక్ కే లు వరుస వికెట్లు సాధించడంతో 195  పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

విజయానికి 28 బంతుల్లో తొమ్మిది పరుగులు కావాల్సి ఉండగా, కేవలం ఒక వికెట్ మాత్రమే చేతిలో ఉంది, ఈ దశలో శ్రుబ్ షోల్-డీన్ లు ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా 47.2 ఓవర్లలో లక్ష్యం సాధించి ఇంగ్లాండ్ కు అపూర్వ విజయం అందించారు.

ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ లో టాపార్డర్ బ్యాట్స్ విమెన్ మాత్రమే రాణించారు. మడ్డీ గ్రీన్-52; సోఫీ డెవిన్-41; అమేలియా కేర్ర్-24; సత్తార్ వైట్-24; బేట్స్-22 పరుగులు చేశారు. 48.5 ఓవర్లలో 203 పరుగులకు కివీస్ ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో కాటే క్రాస్, ఎక్సెల్ స్టోన్ చెరో మూడు; డీన్ రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ 17 పరుగులకే తొలి వికెట్ (డానియెల్ వ్యాట్-12) కోల్పోయింది. ఆ తర్వాత బ్యూమోంట్-; కెప్టెన్ నైట్-;అమీ జోన్స్- చేసి ఓటయ్యారు. ఈ దశలో నటాలియా స్కైవర్- సోఫియా డంక్లీ ఐదో వికెట్ కు 70 పరుగులు జోడించి విజయానికి పటిష్ట పునాదులు వేశారు. స్కైవర్-61; డంక్లీ-33 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో ఉత్కంఠగా మారిన మ్యాచ్ లో  చివరకు ఇంగ్లాండ్ దే పైచేయి అయ్యింది. కివీస్ బౌలర్లలో మాక్ కే నాలుగు; జెస్ కేర్ర్ రెండు; తుహుహు, బ్రూక్ చెరో వికెట్ పడగొట్టారు.

స్కైవర్  కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్