తెలంగాణ రైతుల సమస్యలపై ఢిల్లీ వేదికగా ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుదాం’ అంటూ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏం చేస్తామో అన్ని ఇప్పుడే చెప్పమని, అవసరమైతే ఇండియా గెట్ దగ్గర వరి ధాన్యం పోస్తామని సిఎం కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పంజాబ్ తరహాలో తెలంగాణ నుంచి కూడా కేంద్రం రెండు పంటలు కొనేలా ఉద్యమిద్దామని చెప్పారు.
శివాజీ మహరాజ్ ను గౌరవించనది ఎవరని, దేశప్రజలంతా గౌరవిస్తారని కెసిఆర్ అన్నారు. దేశంలో మార్పు కోసం పీకే(ప్రశాంత్ కిషోర్ ) తో కలసి పని చేస్తున్నామని, నాకు ఏడూ, ఎనిమిది ఏళ్లుగా ప్రశాంత కిషోర్ తో స్నేహం ఉందన్నారు. డబ్బుల కోసం పీకే ఎప్పుడు పని చేయరని, ఆరు నూరు అయిన ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళమని కెసిఆర్ స్పష్టం చేశారు. ఈడీ …బోడి దాడులకు కేసీఆర్ భయపడడని తెగేసి చెప్పారు. ఇటువంటివి అన్ని చోట్ల పని చేయవాణి, బోడి బెదిరింపులకు భయపడమన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 95 -105 సీట్లు గెలుస్తామని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రం ఏ వర్గాన్ని సంతృప్తి పరచటం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. 28వ తేదీన యాదాద్రికి పార్టీ శ్రేణులంతా తరలిరావాలని సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా షబ్ కమిటీ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. దేశంలో అసలు సమస్యలే లేవని బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ చేపట్టే ఈ రైతు ఉద్యమంలో రైతులను కూడా భాగస్వామ్యులను చేయాలని నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
Also Read : తెలంగాణలో జనశక్తి కదలికలు?