Wednesday, November 27, 2024
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: ఆసీస్ జైత్రయాత్ర

మహిళల వరల్డ్ కప్: ఆసీస్ జైత్రయాత్ర

Aussies-non-stop: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదు విజయాలతో  ఇప్పటికే సెమీఫైనల్లో ప్రవేశించిన ఆసీస్ మహిళలు నేడు సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించారు. కెప్టెన్ మెగ్ లన్నింగ్ 135 పరుగుల (130 బంతులు, 15 ఫోర్లు, 1సిక్సర్)తో అజేయంగా నిలిచింది.

వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా తొలి వికెట్ కు 88 పరుగులు చేసింది. ఓపెనర్ లీ 36 పరుగులు చేసి అవుట్ కాగా, 118 వద్ద లారా గూడాల్(15)పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ వోల్వార్డ్ 90 పరుగులు చేసి వెనుదిరిగింది. కెప్టెన్ సూనే లూస్ అర్ధ సెంచరీ (52)తో రాణించింది. చివర్లో కాప్ (30), ట్రైయాన్ (17) ధాటిగా ఆడడంతో  నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగులు చేసింది.  ఆసీస్ బౌలర్లలో స్కట్, జోనస్సెన్, గార్డెనర్, సుదర్లాండ్, అలానా కింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 14 వద్ద మొదటి (అలెస్సా హేలీ-5); 45 వద్ద రెండవ (రేచల్ హేన్స్-17) వికెట్ కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ లన్నింగ్- బెత్ మూనీతో కలిసి మూడో వికెట్ కు 60, తహిలా మెక్ గ్రాత్ తో కలిసి నాలుగో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూనీ-21; మెక్ గ్రాత్ 32, గార్డెనర్-22 పరుగులు చేశారు. సుదర్లాండ్ 22 తో కెప్టెన్ లన్నింగ్ (135) తో కలిసి అజేయంగా నిలిచింది. 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది.  సౌతాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, క్లో ట్రైయాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

లన్నింగ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

ఇవి కూడా చదవండి: మహిళల వరల్డ్ కప్: పాకిస్తాన్ కు తొలి విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్