తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు (బుధవారం) తెల్లవారు జామున రెండు భూకంపాలు సంభవించాయి. భూకంపం ధాటికి రాజధాని తైపీలోని భవనాలు ఊగిపోయాయి. తైపీలో భారీగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. తైపీ నగరానికి దక్షిణాన 182 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మరోవైపు,హుయాలిన్ (Hualien county )కౌంటీకి దక్షిణాన తైతుంగ్ (Taitung)నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో మరో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో జరిగిన ఆస్థి, ప్రాణ నష్టం సమాచారం తేలియాల్సి ఉంది.
తైవాన్ రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంది. దీంతో తరచూ భూకంపాలకు గురవుతుంది. 2016లో దక్షిణ తైవాన్ లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించగా, 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల రెండు వేల మందికి పైగా మరణించారు