CM Back Step: అమరావతిపై శాసన సభ సాక్షిగా సిఎం జగన్ మడమ తిప్పారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు విమర్శించారు. నేడు అసెంబ్లీలో రాజధానిపై సిఎం స్పందించిన తీరుని సోము తీవ్రంగా తప్పుబట్టారు. అమరావతికి బిజెపి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. పార్లమెంట్, న్యాయస్థానాలను అసెంబ్లీలో వినియోగించి వికేంద్రీకరణ పాటపాడడం దారుణమన్నారు.
కర్నూలులో హైకోర్టు ఉండాలని బిజెపి కోరుకుందని, రాజధాని కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. అమరావతి రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని, ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలని హితవు పలికారు. కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి పై శ్వేపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం పాలనపై బ్లాక్ పేపర్ విడుదల చేయాలని దుయ్యబట్టారు.
Also Read : వికేంద్రీకరణపై వెనకడుగు లేదు: సిఎం జగన్