Tuesday, April 1, 2025
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: ఎదురులేని ఆసీస్

మహిళల వరల్డ్ కప్: ఎదురులేని ఆసీస్

Aussies: ఐసిసి మహిళా వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఏడు లీగ్ మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించింది. నేడు బంగ్లాదేశ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్  5వికెట్లతో గెలుపొంది సత్తా చాటింది. ఆసీస్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా బెత్ మూనీ- అన్నాబెల్ సుతర్లాండ్ లు నిలకడగా రాణించి ఆరో వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి  గెలుపుకు బాటలు వేశారు.

వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ మైదానం వేదికగా జరిగిన నేటి మ్యాచ్ ను వర్షం కారణంగా  43 ఓవర్లకు కుదించారు. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ బ్యాట్స్ విమెన్ లో లతా మండల్-33; ఓపెనర్ షర్మిన్ అక్తర్-24 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. బంగ్లా 43 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో గార్డెనర్, జోనస్సెన్ చెరో రెండు; స్కట్, సుతర్లాండ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత  బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ మహిళలు వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు.  బంగ్లా బౌలర్ సల్మా ఖాతూన్ మూడు వికెట్లతో (అలెస్సా హేలీ-15; రేచల్ హేన్స్-7; మెగ్ లన్నింగ్-డకౌట్)  ఆసీస్ టాపార్డర్ ను దెబ్బ తీసింది. తర్వాత తహిలా మెక్ గ్రాత్-3; గార్డెనర్-13 కూడా  తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో బెత్ మూనీ-66; సుతర్లాండ్- 26 అజేయంగా నిలిచి విజయం అందించారు.  బంగ్లా బౌలర్లలో సల్మా మూడు; నహిదా అక్తర్, రుమానా అహ్మద్ చెరో వికెట్ సాధించారు.

66 పరుగులతో అజేయంగా నిలిచిన బెత్ మూనీకే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : మహిళల వరల్డ్ కప్: సెమీస్ రేసులో ఇంగ్లాండ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్