Saturday, November 23, 2024
HomeTrending Newsవైద్యానికి బడ్జెట్ లో భారీ నిధులు: హరీష్

వైద్యానికి బడ్జెట్ లో భారీ నిధులు: హరీష్

Health Priority: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ‌గా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌డ్జెట్‌లో వైద్య ఆరోగ్య రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య; ఆర్ధిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు ప్ర‌జారోగ్యం కోసం రూ.11,237 కోట్లు కేటాయించారని, బ‌డ్జెట్ కేటాయింపుల‌తో పాటు మొత్తం 80,039 పోస్టుల భ‌ర్తీలో 12,755 ఉద్యోగాలు ఆరోగ్య శాఖ‌లో భ‌ర్తీ చేసుకోబోతున్నామని వివరించారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ పురోగ‌మిస్తున్న‌దని తెలిపారు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం సైతం  వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించిందని గుర్తు చేశారు. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చిన్నారుల కోసం ఒక కోటి 60 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 40 పడకల ప్రత్యేక ఐసీయూ ను అయన ప్రారంభించారు. డయాలసిస్ మిషన్ ల సంఖ్యను 4 నుంచి 8 కి పెంచారు.

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ  తాజా బ‌డ్జెట్ ప్ర‌కారం, తెలంగాణ ప్ర‌భుత్వ త‌ల‌స‌రి వైద్య ఖ‌ర్చు రూ. 3,092 కు చేరుకుందని, కేంద్రం నుంచి ఎలాంటి స‌హ‌కారం లేకున్నా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి నాంది ప‌లికారని వెల్లడించారు.  కేంద్రం నుంచి ఒక్క మెడిక‌ల్ కాలేజీ మంజూరు కాకున్నా, రాష్ట్ర ప్రభుత్వ  సొంత ఖ‌ర్చుల‌తో జిల్లాకో మెడిక‌ల్ కాలేజీ ఉండేలా ముఖ్య‌మంత్రి చ‌ర్య‌లు తీసుకుంటున్నారన్నారు.

తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగంలో ఉన్న మూడంచెల విధానాన్ని 5 అంచెలు పెంచుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేస్తున్నామని,   ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో నిమ్స్ ఒక్కటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండగా.. ఇప్పుడు హైదరాబాద్ కు నలువైపుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్  ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.  వరంగల్ లోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు హైదరాబాద్ నిమ్స్ లోనూ పడకల సామర్ధ్యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్