ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొమ్మిదవ షెడ్యూల్ మరియు పదవ షెడ్యూల్ కు సంబంధించిన అంశాలు మరియు పబ్లిక్ , గవర్నమెంట్ ఆస్తుల పై చర్చించారు.
షెడ్యూల్ IX మరియు షెడ్యూల్ X పరిధిలోకి వచ్చే సంస్థలపై శాఖల వారిగా మంత్రి హరీష్ రావు సమీక్షించారు. విటితో పాటు ప్రభుత్వ శాఖల వారీగా ఉన్న ఆస్తుల డేటా సేకరణపై సమీక్షించారు. నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం ప్రతి విభాగం కింద ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆస్తుల సంఖ్య వివరాలను సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ.రాణి కుముదిని, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఇపిటిఆర్ఐ డిజి , స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, బి.సి. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ , వివిధ విభాగాల కార్యదర్శులు హాజరయ్యారు.