Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్పొట్టి ఫార్మాట్ కు ‘శిఖర’ సారధ్యం

పొట్టి ఫార్మాట్ కు ‘శిఖర’ సారధ్యం

శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నాడు.  శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ లు భారత జట్టు ఆడనుంది. మొత్తం 20 మదితో కూడిన జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఆరుగురు కొత్త ఆటగాళ్లకు జట్టులో స్థానం లభించింది.  పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

ఐపిఎల్ లో తమ సత్తా చాటిన యువ తరంగాలు దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, నితీష్ రానా, కృష్ణప్ప గౌతమ్, రుతురాజ్ గైక్వాడ్, వరుణ్ చక్రవర్తిలు జాతీయ జట్టులో తొలిసారి స్థానం సంపాదించారు.

పృథ్వీ షా, మనీష్ పాండే లకూ అవకాశం లభించింది. భుజం నొప్పి తో కొన్నాళ్ళుగా ఆటకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ కు చోటు లభించలేదు. ఇంకా గాయం నుంచి అయ్యర్ కోలుకొని కారణంగా సెలెక్టర్లు అతని పేరును పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ తోపాటు పాండ్యా బ్రదర్స్ కూడా జట్టులో ఉన్నారు. వికెట్ కీపర్ – బాట్స్ మెన్ సంజూ శామ్సన్, ఇషాన్ ఖాన్ లకు కూడా అవకాశం ఇచ్చారు..

భారత జట్టులోని సీనియర్లు విరాట్ కోహ్లి నాయకత్వంలో సౌతాంప్టన్ లో న్యూ జిలాండ్ తో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ ఆడేందుకు ఇంగ్లాండ్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన దాదాపు 40 రోజుల తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో  డబ్ల్యూ.టి.సి. ఫైనల్ తరువాత ఇండియా వచ్చి తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళడం సరికాదని బిసిసిఐ భావించింది. అందుకే శ్రీలంక టూర్ కు యువ, కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బిసిసిఐ భావించింది.

శ్రీలంకతో జరిగే ఈ అన్ని మ్యాచ్ లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతాయి.  జూలై 13, 16, 18 తేదీల్లో వన్డే మ్యాచ్ లు, 21, 23, 25 తేదీల్లో టి-20 మ్యాచ్ లు ఉంటాయి.

జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్య కుమార్ యాదవ్, మనీష్ పండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రానా, ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్, యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, క్రునాల్ పాండ్యా, గౌతం, కులదీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ (వైస్-కెప్టెన్). దీపక్ చాహర్, నవ దీప శైనీ, చేతన్ సకారియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్