CM review on Irrigation: పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ కు సంబంధించిన డిజైన్లు త్వరగా తెప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాంప్ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా ఇప్పటివరకూ జరిగిన పనులు, భవిష్యత్తులో పూర్తిచేయాల్సిన పనులపైనా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు.
పోలవరం ప్రాజెక్టుపై అధికారులు అందించిన వివరాలు
డౌన్ స్ట్రీం కాఫర్ డ్యాం కు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయి, జులై 31 కల్లా పని పూర్తవుతుంది
ఈసీఆర్‌ఎఫ్ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయి
ఆర్ అండ్ ఆర్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టాము, ప్రాధాన్యతా క్రమంలో కుటుంబాలను తరలిస్తున్నాం
మొదటగా ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20946 కుటుంబాల్లో ఇప్పటికే 7962 మందిని తరలించాం
3228 మంది ఓటీఎస్ కు దరఖాస్తు చేసుకున్నరు, మిగిలిన 9756 మందిని తరలించాల్సి ఉంది.
నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తిచేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తున్నాం
సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయి, దీన్ని కూడా మే 15 నాటికి పూర్తిచేస్తాం
అవుకు టన్నెల్–2లో మిగిలిపోయిన పనులు కేవలం 77.5 మీటర్లు, ఈ సీజన్‌లో పనులు పూర్తి చేస్తాం
120 రోజుల్లో పనులు పూర్తిచేసేలా ప్రణాళిక వేశాం
సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని ఆదేశించిన సిఎం
అవుకు టన్నెల్ లైనింగ్ సహా ఆగస్టుకల్లా పనులు పూర్తయ్యేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్న సిఎం
నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్–2, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వర్క్స్, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 1 నుంచి నీటి విడుదల, ఇదే ప్రాజెక్టులో టన్నెల్–2 పనులు, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార స్టేజ్ –2లో ఫేజ్–2 పనులపైనా సీఎం సమీక్షించారు.
ఈ సమీక్షా సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : పోలవరం పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి హామీ