Sunday, January 19, 2025
HomeTrending Newsటిడిపిది గోబెల్స్ ప్రచారం: సజ్జల

టిడిపిది గోబెల్స్ ప్రచారం: సజ్జల

విద్యుత్ ఛార్జీల పెంపుపై విపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ళలో విద్యుత్ భారం మోపలేదని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు, డిస్కమ్ లకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా ఆ భారం అంతా అలాగే ఉంచి వెళ్ళారన్నారు. ఈ మూడేళ్ళలో దాదాపు 42 వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సజ్జల తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వంలో దాదాపు 19 వేల కోట్ల రూపాయలను ట్రూ అప్ ఛార్జీల భారాన్ని అయితే ప్రజల నుంచి అయినా వసూలు చేయాల్సింది, లేదా డిస్కమ్ లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, భారం మోయకుండా బాధ్యత లేకుండా తమకు పెండింగ్ వదిలి వెళ్ళారని వివరించారు.  గతంలో ఏడాదికి ఒకసారి పెద్ద మొత్తంలో ఎసీడీ ఛార్జీల రూపంలో వసూలు చేసేవారని, కానీ తమ ప్రభుత్వం ఏ నెలలో వాడిన దానికి అదే నెలలో బిల్లును చెల్లించేలా సంస్కరణ తెచ్చిందని వెల్లడించారు.

మూడేళ్ళలో 500 యూనిట్ల లోపు వారికి ఒక్క రూపాయి కూడా విద్యుత్ భారం పెంచలేదని సజ్జల చెప్పారు. ఇప్పుడు కూడా ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో హేతుబద్దంగా స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదన వచ్చిందన్నారు. వంద యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఇతర రాష్ట్రాల కంటే ఏపీ లోనే తక్కువగా ఉన్నాయని, ప్రజలు అర్ధం చేసుకుంటారనే నమ్మకం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read :   టిడిపికి 40 కాదు, 27 మాత్రమే: సజ్జల

RELATED ARTICLES

Most Popular

న్యూస్