Saturday, November 23, 2024
HomeTrending Newsపోలవరం నీటి మళ్లింపు ప్రారంభం

పోలవరం నీటి మళ్లింపు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపుకు పూజా కార్యాక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిబ్బంది పాల్గొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా  ఈసిఆర్ఎఫ్(ECRF) నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా   గోదావరి నీటి విడుదల చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఈ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టాకు చేరుతుంది, దీనితో వేలాది ఎకరాలకు సాగునీరు అంది పంటలు సశ్యశ్యామలం కానున్నాయి,

ఈ సీజన్ లోనే వరద నీటిని మళ్లించడానికి అనుగుణంగా  అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు చేయడంతో పాటు స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తి చేశారు.  దీనితో గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం కూడా పూర్తయింది.  6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లింపు చేయడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు.

కార్యక్రమంలో పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, ఈఈలు మల్లి ఖార్జునరావు, ఆదిరెడ్డి, బాలకృష్ణ, మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎంలు ముద్దుకృష్ణ, దేవ్ మని మిశ్రా, సిజిఎం రవీంద్రరెడ్డి, ఎజిఎం రాజేశ్, డిజిఎం శ్యామలరావు, మేనేజర్ మురళి తతిదరులు పాల్గొన్నారు.

అతి తక్కువ సమయం భారీ పనులు,నిర్మాణాలు పూర్తి చేసి, డెల్టా కు నీరందించే ప్రక్రియ పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థను అధికారులు, నేతలు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్