Sunday, November 24, 2024
HomeTrending Newsప్రగతిభవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

ప్రగతిభవన్ లో ఘనంగా ఉగాది వేడుకలు

శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. తెలంగాణకు ఈ ఏడాది 75 శాతం మంచి జరుగుతుందని  పంచాంగ పఠనంలో చెప్పారు. బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ పఠనం చేశారు. తెలంగాణలో వర్షాలు పడతాయని, పంటలు బగా పండుతాయని తెలిపారు. ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం అని పంచాంగం కూడా చెబుతుందని బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. పాలన పరంగా అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఆయన పంచాంగ పఠనంలో చెప్పారు. హాజరైన మంత్రులు.. అధికారులు… తెలంగాణలో ఈ ఏడాది అద్భుతాలు జరుగుతాయని చెప్పారు. ఇంటా, బయటా మహిళల ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి సాహసోపేతమైన నిర్ణయాలు వెలువడుతాయని తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది పురాస్కారాలను అందచేశారు. సన్మానించారు.

వేములవాడ రాజన్న ప్రభ మళ్ళీ వెలుగబోతుందని, ఈ సంవత్సరం ఎక్కువ మంచి జరగబోతుందని పంచాంగ శ్రవణంలో వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిపాలన అందిస్తారని, పంటలు అద్భుతంగా పండపోతున్నాయని చెప్పారు. తెలంగాణలో రైతుల రాజులు కాబోతున్నారని, 2015 నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో వర్షాలకు ఇబ్బందులు లేవన్నారు. ప్రజా ఆరోగ్యం బాగా ఉంటుందని… మాస్క్ లు అక్కర్లేదు… విద్యా రంగం పట్టాలు ఎక్కబోతుంది… ఆన్లైన్ తరగతులు ఇక ఉండవని, ఇది ఉద్యోగ నామ సంవత్సరం అని వివరించారు. వాగ్దాటి గల వ్యక్తులకు రాజా యోగం ఉంటుందన్నారు. రాష్ట్రంలో యజ్ఞ యాగదులు ఎక్కువగా జరగాలన్నారు. సరిహద్దులలో ఉద్రిక్తతలు తలెత్తేఅవకాశం ఉందని.. పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం పొంచి ఉందని హెచ్చరించారు. రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటాయని, పార్టీలు మారే వారికి గడ్డుకాలం ఉందన్నారు. ఫ్రాన్స్, రష్యాలో అలజడి రేగుతుందన్నారు.

రియల్ ఎస్టేట్ రంగం ఒక్క హైదరాబాద్ లో నే బాగుంటుందని, హైదరాబాద్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంటుందని, మీడియాలో వార్తలకు ఇబ్బందులు లేవని చమత్కరించారు. రైలు, ప్రకృతి, అగ్ని ప్రమాదాలు అక్కడక్కడ దేశంలో జరుగుతాయన్నారు. తెలంగాణకు ఎలాంటి ప్రమాదం లేదని అయితే నాయకులు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్