Thursday, April 17, 2025
HomeTrending Newsచీఫ్‌ జస్టిస్‌ NV రమణకు ఘన స్వాగతం

చీఫ్‌ జస్టిస్‌ NV రమణకు ఘన స్వాగతం

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ NV రమణకు గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాజ్‌భవన్‌లో ఘనంగా స్వాగతం పలికారు.  అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా NV రమణ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చారు. మూడు రోజులపాటు రాజ్‌భవన్‌ అతిథిగృహంలో బస చేయనున్నారు.

అంతకుముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో NV రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్