Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: చెన్నైపై పంజాబ్ విజయం

ఐపీఎల్: చెన్నైపై పంజాబ్ విజయం

IPl-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ 54 పరుగులతో విజయం సాధించింది. చెన్నైలో శివమ్ దూబే మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో పంజాబ్ విసిరిన 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది, 18 ఓవర్లలో 126 పరుగులకే చెన్నై ఆలౌట్ అయ్యింది.

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్(4) మరోసారి విఫలం కాగా భానుక రాజపక్ష (9) కూడా నిరాశ పరిచాడు, 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో శిఖర్ ధావన్, లివింగ్ స్టోన్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. మూడో వికెట్ కు 95 పరుగులు జోడించారు, ధావన్ 33; లివింగ్ స్టోన్ 60 (32 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు) చేశారు. తర్వాత వచ్చిన వారిలో జితేష్ శర్మ 26; రాబడ12; రాహూల్ చాహర్ 12 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లో జోర్డాన్, ప్రెటోరియస్ చెరో రెండు; ముఖేష్ చౌదరి, బ్రావో, జడేజా తలా ఒక వికెట్ సాధించారు.

లక్ష్య సాధనలో చెన్నై బ్యాట్స్ మెన్ దారుణంగా విఫలమయ్యారు. చెన్నై 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. మొయిన్ అలీ, కెప్టెన్ జడేజా డకౌట్ కాగా… రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు చెరో 13, రుతురాజ్ గైక్వాడ్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టారు. ఈ దశలో శివం దూబే, ధోనీ ఆరో వికెట్ కు 62 పరుగులు చేశారు. దూబే 30 బంతుల్లో 6 ఫోర్లు, 3  సిక్సర్లతో 57 పరుగులు చేసి ఔట్ కాగా, బ్రావో డకౌట్; ప్రేటోరియస్-8; క్రిస్ జోర్డాన్-5 పరుగులు మాత్రమే చేశారు. ధోనీ 23 పరుగులు చేసి ఔటయ్యాడు.  పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు; వైభవ్ అరోరా, లివింగ్ స్టోన్ చెరో రెండు; రబడ, ఆర్ష దీప సింగ్, ఓడియన్ స్మిత్ తలా ఒక వికెట్ సాధించారు.

ఆల్ రౌండర్ ప్రతిభ చూపిన లివింగ్ స్టోన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: ఢిల్లీపై గుజరాత్ గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్