Saturday, November 23, 2024
HomeTrending Newsఅన్నా.. ఛాలెంజ్ స్వీక‌రిస్తున్నా: కేటీఆర్‌

అన్నా.. ఛాలెంజ్ స్వీక‌రిస్తున్నా: కేటీఆర్‌

మంత్రి కేటీఆర్‌, క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తికర చ‌ర్చ జరిగింది. బెంగుళూరులో మౌళిక స‌దుపాయాలు స‌రిగా లేవ‌ని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్(facebook) సీఈవో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు. దానికి మంత్రి కేటీఆర్ బదులిస్తూ.. మీరంతా హైద‌రాబాద్‌కు రావొచ్చని, ఇక్క‌డ ఉత్త‌మ స‌దుపాయాలున్న‌ట్లు ట్వీట్ చేశారు. ఇన్నోవేష‌న్‌, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, ఇంక్లూజివ్ గ్రోత్‌పై త‌మ ప్ర‌భుత్వం దృష్టి పెట్టిన‌ట్లు మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు.

ఆ ట్వీట్‌కు ఇవాళ క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ కౌంట‌ర్ ఇచ్చారు. మీ ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తున్నామ‌ని, 2023లో క‌ర్నాట‌క‌లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని, మ‌ళ్లీ బెంగుళూరుకు పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకురానున్న‌ట్లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. శివ‌కుమార్ అన్నా.. క‌ర్నాట‌క రాజ‌కీయాల గురించి అంత‌గా తెలియ‌ద‌ని, అక్క‌డ ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేన‌ని, కానీ మీరు విసిరిన స‌వాల్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ బదులు ఇచ్చారు.

దేశ యువ‌త, సౌభాగ్యం కోసం ఉద్యోగాల క‌ల్ప‌న ద్వారా హైద‌రాబాద్‌, బెంగుళూరు న‌గ‌రాల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండాల‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఐటీ, బీటీల‌పై ఫోక‌స్ పెడుదామ‌ని, కానీ హ‌లాల్‌, హిజాబ్ లాంటి అంశాల‌పై దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్