Saturday, November 23, 2024
HomeTrending Newsసిపిఐ (చంద్రబాబు) పార్టీ పెట్టుకోండి: పేర్ని

సిపిఐ (చంద్రబాబు) పార్టీ పెట్టుకోండి: పేర్ని

Perni suggestion: తనది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు… షుమారు 14 సంవత్సరాలు సిఎంగా పనిచేసి కొత్త జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అంత అనుభవం ఉన్న బాబు కనీసం తన సొంత నియోజకవర్గం కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలని సిఎం జగన్ ను అడగడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుంటే చంద్రబాబు వెంటనే పవన్‌ కల్యాణ్‌ను తెరమీదకు వదిలాడని ఆరోపించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.  “తాను చేయాల్సింది చేయకపోగా, చేతకాక…. ఇప్పుడు మాత్రం తాను ఆడమన్నట్టు ఆడేవారిని, పాడమన్నట్టు పాడేవారిని కొంతమందిని చుట్టూ పెట్టుకుని సన్నాయి నొక్కులు నొక్కిస్తున్నాడు చంద్రబాబు” అని నాని విమర్శించారు.

కొత్త జిల్లాలపై పవన్ చేసిన విమర్శలను నాని ఖండించారు. జిల్లాల నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ ఉన్నారని, నోటిఫికేషన్ పై ఏమైనా అధ్యయనం చేశారా? తనవైపు నుంచి గానీ, తన పార్టీ వైపు నుంచి కానీ ప్రభుత్వానికి ఏవైనా ప్రతిపాదనలు పంపారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంకెంతకాలం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారని,  మిమ్మల్ని నమ్మి, మీ పార్టీ జెండా మోస్తూ మీరు సిఎం కావాలని అభిమానులు అరుస్తుంటే.. ‘చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి, వైఎస్ జగన్‌ని అర్జెంట్‌గా ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంటూ మంగళగిరి మీటింగ్‌లో చెప్పిన విషయం స్తవం కాదా’ అని నాని పవన్ ను ప్రశ్నించారు.

గుండెల నిండా చంద్రబాబు బొమ్మను నింపుకున్న సీపీఐ నేతలు రామకృష్ణ, నారాయణ కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏవేవో విమర్శలు చేస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్న మంచి వారికి కనబడడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఈ ఇద్దరు నేతలూ చివరకు కమ్యూనిస్ట్‌ పార్టీని క్యాపిటలిస్ట్‌ల పార్టీగా మార్చిపారేశారని ధ్వజమెత్తారు. వీరికి కమ్యూనిస్ట్‌ పార్టీ మీద భక్తి, గౌరవ భావం ఉంటే  బైటకు వెళ్లి సీపీఐ(చంద్రబాబు) అని పార్టీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని తీవ్రంగా మండిపడ్డారు.

Also Read : నేటి నుంచి 26 జిల్లాలతో ఏపీ పాలన

RELATED ARTICLES

Most Popular

న్యూస్