Saturday, November 23, 2024
HomeTrending Newsకొత్త జిల్లాలు కలుపుతూ జాతీయ రహదార్లు

కొత్త జిల్లాలు కలుపుతూ జాతీయ రహదార్లు

Jagan-Gadkari: రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడ్డ  జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం ఈ ఉదయం నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు,

నితిన్ గడ్కరీకి సిఎం జగన్ చేసిన విజ్ఞప్తులు

  • విశాఖ– భోగాపురం బీచ్‌ కారిడర్‌ ప్రాజెక్ట్‌ కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు
  • విశాఖనుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటకరంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి సహాయ సహకారాలు అందించాలి
  • విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సీఆర్డీయే గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలి
  • విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలి
  • విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలి
  • రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిండి, మిగిలిన 17 ఆర్వోబీలనూ వెంటనే ఆమోదం తెలపాలి
  • రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది.
  • ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరు చేయాలి

Also Read : అభివృద్ధి పథంలో ఏపీ: నితిన్ గడ్కరీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్