Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: కమ్మిన్స్ విధ్వంసం-కోల్ కతా గెలుపు

ఐపీఎల్: కమ్మిన్స్ విధ్వంసం-కోల్ కతా గెలుపు

Pat Cummins smashed: కోల్ కతా ఆటగాడు పాట్ కమ్మిన్స్ విధ్వంసం సృష్టించడంతో ముంబై ఇండియన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ 5 వికెట్లతో ఘన విజయం సాధించింది. కమ్మిన్స్ కేవలం 15 బంతుల్లో 4 ఫోర్లు 6 భారీ సిక్సర్లతో 56 పరుగులతో నాటౌట్ గా నిలిచి మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే అధ్బుత విజయం అందించాడు. వెంకటేష్ అయ్యర్ కూడా 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(3) మరోసారి విఫలమయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన డివాల్ద్ బ్రెవీస్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 14 మాత్రమే చేశాడు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ ముంబై ఇన్నింగ్స్ చక్కదిద్దారు. నాలుగో వికెట్ కు ఇద్దరూ కలిసి 83 పరుగులు జోడించారు.  సూర్య కుమార్ యాదవ్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చివరి ఓవర్ మొదటి బంతికి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పోలార్డ్ ఐదు బంతులాడి మూడు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టాడు. తిలక్ వర్మ 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. కోల్ కతా  బౌలర్లలో పాట్ కమ్మిన్స్ రెండు; ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు.

తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్ కతా 16 పరుగులకే తొలి వికెట్ (రెహానే-7) కే కోల్పోయింది. 35 పరుగుల వద్ద కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (10) కూడా పెవిలియన్ చేరాడు. రెండు సిక్సర్లు కొట్టి క్రీజులో నిలదొక్కుకుంటున్న శామ్ బిల్లింగ్స్ (17) ను మురుగన్ అశ్విన్ అవుట్ చేశాడు. నితీష్ రానా(8), ఆండ్రూ రస్సెల్ (11) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో వెంకటేష్ అయ్యర్ కు జత కలిసిన కమ్మిన్స్ భీభత్సం సృష్టించాడు.

కమ్మిన్స్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: రాజస్థాన్ జోరుకు బెంగుళూరు బ్రేక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్