Tuesday, September 24, 2024
HomeTrending Newsకేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరు ఉధృతం

కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరు ఉధృతం

 Black Flags : కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఉధృతం చేసింది. పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేస్తూ జంగ్‌ సైరన్‌ మోగించింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. మోదీ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ..శవయాత్రలు నిర్వహించారు. బీజేపీ వ్యతిరేకంగా పల్లెపల్లెనా నల్ల జెండాలు ఎగుర వేస్తూ ప్రజలు తమ నిరసన తెలియజేస్తున్నారు.

యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ  కేంద్ర వైఖ‌రికి నిర‌స‌న‌గా రైతుల ప‌క్షాన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర్మల్ లోని తన నివాసంపై నల్లజెండా ఎగురవేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… వ‌రి ధాన్యం కొనుగోళ్ల‌లో కేంద్ర ప్ర‌భుత్వం  అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా నల్లజెండా ఎగురవేశామ‌న్నారు. తెలంగాణ రైత‌న్న‌లు పండించిన వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని, తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివ‌క్ష‌ను వీడ‌నాడాల‌ని డిమాండ్ చేశారు. వడ్లు కొనేదాకా రైతుల త‌రపున కేంద్రంపై పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

మహబూబాబాద్ లో నల్ల జెండాలతో నిరసన చేపట్టిన టిఆర్ఎస్పార్టీ జిల్లా అధ్యక్షురాలు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, పార్టీ నేతలు.  ఊరూరా ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని, గ్రామ కూడళ్లలో కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేసి ఢిల్లీ వ‌ర‌కు ఈ నిర‌స‌న సెగ‌లు తాకేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని కవిత పిలుపు ఇచ్చారు.

జగిత్యాల జిల్లా సారంగాపూర్ లో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మతో శవయాత్రలో పాల్గొని పాడే మోసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. బీజేపీ ఎంపీలు పూటకో మాట మారుస్తున్నారని వరి వేయండి కేంద్ర ప్రభుత్వంతో కొనుగోలు చేపించడం మా బాధ్యత అని, ఇప్పుడు చేతులెత్తేసి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Black Flags

రైతుల ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రం పై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఖమ్మంలో తెరాస చేపట్టిన వాహన ర్యాలిలో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు.

తెలంగాణలో పండిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నల్ల జెండా ఎగరవేశారు. తెలంగాణ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో 3000 బైక్ లతో TRS కార్యకర్తలు నల్ల జెండలతో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

పంజాబ్ తరహాలో సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహబూబ్ నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ లో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రైతులతో కలిసి ఇంటిపై నల్ల జెండాను ఎగురవేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్