Wednesday, April 2, 2025
Homeసినిమాతోట తరణికి ‘... వీరమల్లు’ టీమ్ సత్కారం

తోట తరణికి ‘… వీరమల్లు’ టీమ్ సత్కారం

Felicitation to Art: పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్,  విలక్షణ చిత్రాల ద‌ర్శకుడు క్రిష్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ సినిమా షూటింగ్ నేడు పునః ప్రారంభమైంది. దాదాపుగా 150 కోట్ల భారీ బ‌డ్జెట్ తో సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం.ర‌త్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డం విశేషం.   ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న‌ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ న‌టిస్తోంది.

ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని పవన్, సినిమా యూనిట్ భావిస్తున్నారు. అందుక‌నే ఈ మూవీ కోసం పవన్ బల్క్ డేట్స్ కూడా ఇచ్చార‌ని తెలిసింది. హైదరాబాద్‌లో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో తాజా షూటింగ్  మొదలైంది.

పలు సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన సెట్లు వేసి ఆయా సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించిన లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోటతరణి నేడు షూటింగ్ స్పాట్ కు వచ్చారు. ఆయన్ను పవన్ కళ్యాణ్ తో పాటు సినిమా దర్శక నిర్మాతలు క్రిష్, ఏఎం రత్నం ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్