Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: ‘శివ’మెత్తిన దూబే, ఊతప్ప: చెన్నై గెలుపు

ఐపీఎల్: ‘శివ’మెత్తిన దూబే, ఊతప్ప: చెన్నై గెలుపు

CSK won: ఐపీఎల్ లో చెన్నై సత్తా చాటింది. వరుసగా నాలుగు పరాజయాలు ఎదుర్కొని అభిమానులను నిరాశపరచిన చెన్నై నేడు జరిగిన మ్యాచ్ లో బెంగుళూరుపై 23 పరుగులతో విజయం సాధించింది. శివమ్ దూబే 46బంతుల్లో 5ఫోర్లు,  8 సిక్సర్లతో 95(నాటౌట్); రాబిన్ ఊతప్ప 50 బంతుల్లో 4ఫోర్లు, 9సిక్సర్లతో 88 పరుగులు చేసి బెంగుళూరు బౌలర్లను ఉతికి ఆరేశారు.

నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 19 వద్ద రుతురాజ్ గైక్వాడ్(17); 36 వద్ద మొయిన్ అలీ(3-రనౌట్) వికెట్లను చెన్నై కోల్పోయింది. ఈ ఆనందం బెంగుళూరుకు ఎంతో సేపు నిలవలేదు. మూడో వికెట్ కు శివమ్ దుబే- రాబిన్ ఊతప్ప 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఊతప్ప 88 పరుగులు చేసి హసరంగ బౌలింగ్ లో కోహ్లీ పట్టిన క్యాచ్ కు ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా డకౌట్ అయ్యాడు. దూబే 95 పరుగులతో అజేయంగా నిలిచాడు.  బెంగుళూరు బౌలర్లలో హసరంగ కు రెండు, హాజెల్ వుడ్ కు ఒక వికెట్ దక్కింది.

బెంగుళూరు 50 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కెప్టెన్ డూప్లెసిస్-8; అర్జున్ రావత్-12; కోహ్లీ-1; మాక్స్ వెల్- 26 కే ఔటయ్యారు. షాబాజ్ అహ్మద్- సుయాష్ ప్రభు దేశాయ్ ఐదో వికెట్ కు 60 పరుగులు జోడించారు. షాబాజ్-41; సుయాష్ 34 పరుగులు చేసి ఔటయ్యారు.  చివర్లో దినేష్ కార్తీక్ వేగంగా పరుగులు రాబట్టి 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు.  20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేయగలిగింది.

శివమ్ దూబేకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read ఐపీఎల్: గుజరాత్ జోరుకు హైదరాబాద్ బ్రేక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్