RRR in Japan, China: దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించడం తెలిసిందే. బాహుబలి సినిమాని ఇండియాలోనే కాకుండా చైనాలోనూ, జపాన్ లోనూ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా బాహుబలి బిగ్ సక్సెస్ సాధించింది. ప్రభాస్, రాజమౌళిలకు అక్కడ కూడా అభిమానులు ఉన్నారంటే.. బాహుబలి అక్కడ ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా చైనాలోనూ, జపాన్ లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు జక్కన్న ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ ఓ ఇంటర్ వ్యూలో తెలియచేశారు. ఇంతకీ చరణ్ ఏం చెప్పారంటే.. ఆర్ఆర్ఆర్ మూవీని జపాన్ లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.. మొత్తం 30 దేశాల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని.. రెండు రోజులు అక్కడ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నామని తెలియచేశారు చరణ్.
ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న విడులైంది. ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే.. జపాన్ లోనూ, చైనా లోనూ భారీగా కలెక్షన్స్ రాబట్టేలా జక్కన్న ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. టీమ్ మొత్తానికి అక్కడకు తీసుకువెళ్లాలి అనుకుంటున్నారట. ఎంత కలెక్ట్ చేయనుంది అనేది ఆసక్తిగా మారింది. మరి.. భారీ కలెక్షన్స్ రాబట్టాలనే జక్కన్న ప్లాన్ ఫలిస్తుందో లేదో చూడాలి.
Also Read : యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న నాటు నాటు