Wednesday, April 16, 2025
HomeTrending Newsపోలీసు క్యాంపుపై మావోల మెరుపు దాడి

పోలీసు క్యాంపుపై మావోల మెరుపు దాడి

చత్తిస్-ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపు పై మావోయిస్టులు మెరుపు దాడి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమం కావటంతో వారిని హెలీకాఫ్టర్ ద్వారా రాజధాని రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుట్రు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో అటవీ ప్రాంతాల్లో పోలీసులు, గ్రే హౌండ్స్ బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. మావోలకు ఎంత నష్టం వాటిల్లింది తెలియరాలేదు. ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Also Read : పోలీసులే లక్ష్యంగా మావోల మందుపాతర

RELATED ARTICLES

Most Popular

న్యూస్