Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: చాహల్ మ్యాజిక్: పోరాడి ఓడిన కోల్ కతా

ఐపీఎల్: చాహల్ మ్యాజిక్: పోరాడి ఓడిన కోల్ కతా

Chahal Magic: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పోరాడి ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చాహల్ హ్యాట్రిక్ తో పాటు ఒకే ఓవర్లో మొత్తం నాలుగు వికెట్లతో కోల్ కతా బ్యాటింగ్ లైనప్ ను కకావికలు చేశాడు. దీనితో 217 పరుగుల లక్ష్య ఛేదనలో తుదివరకూ పోరాడిన కోల్ కతా ఏడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ముంబై లోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ తొలి వికెట్ కు 93 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 24 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ధాటిగా ఆడి 61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజూ శామ్సన్-38; హెట్ మెయిర్-26 పరుగులతో  రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లు 16 ఎక్స్ ట్రాలు సమర్పించుకున్నారు. సునీల్ నరేన్ రెండు; శివమ్  మావి, ఆండ్రీ రస్సెల్, కమ్మిన్స్ తలా ఒక వికెట్ పడగొట్టాడు,

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా పరుగుల ఖాతా మొదలు పెట్టకముందే ఓపెనర్ గా వచ్చిన సునీల్ నరేన్ (రనౌట్) వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కు ఓపెనర్ ఆరోన్ పించ్- కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 107 పరుగులు చేశారు. అయ్యర్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 85; పించ్ 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశారు. నితీష్ రానా-18 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిలిగిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. చివర్లో ఉమేష్ యాదవ్(9 బంతుల్లో 21)  మెరుపు ఇన్నింగ్స్ ఆడినా మిగిలిన వారినుంచి సహకారం లేకపోవడంతో 19.4 ఓవర్లలో 210  పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. యజువేంద్ర చాహల్ 17వ ఓవర్లో మొదటి బంతికి వెంకటేష్ అయ్యర్ ను, చివరి మూడు బంతులకూ శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, కమ్మిన్స్ లను అవుట్ చేసి కోల్ కతాను కోలుకోలేని దెబ్బతీశాడు.

యజువేంద్ర చాహల్ కే ‘ప్లేయార్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: ఢిల్లీపై బెంగుళూరు విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్