అటవీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం మరింత పెంచేందుకు వీలుగా ఫారెస్ట్ కాలేజీ చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ (FCRI), సెంచురియన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ ల మధ్య ఒప్పందం కుదిరింది.
విద్యార్థులకు ఆధునిక పరిజ్ఞానం అందించేందుకు వీలుగా శాటిలైట్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్ మెంట్ ఏర్పాటు కోసం ఒప్పంద పత్రాలపై కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్, సెంచురియన్ యూనివర్సిటీ కో ఫౌండర్, వైస్ ప్రెసిడెంట్ డీ. నరసింహారావు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డిప్యూటీ డైరెక్టర్, ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : లక్ష్యాల దిశగా అటవీ కళాశాల