Corona excerpt again: భారతదేశంలో మళ్ళీ కరోనా ఉదృతి పెరుగుతోంది. గత నాలుగు రోజుల నుంచి భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు. దేశంలో కొత్తగా 2067 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా, 40 మరణాలు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే 65శాతం పెరిగిన కోవిడ్ కొత్త కేసులతో రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం దేశంలో 12,340 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.03 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులు. దేశంలో ఇప్పటివరకు 4,30,47,594 కేసులు నమోదు కాగా, 5,22,006 మరణాలు కరోనాతో సంభవించాయి.
ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మిజోరాం రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు. డెల్టా వైరస్ సోకిన వారికి, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఏర్పడే రోగ నిరోధక శక్తిని సైతం ఒమిక్రాన్ ఆధిగమిస్తోందని…భారత వైద్య పరిశోధన మండలి ప్రకటించింది. మాస్కు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరిగా పాటించాలని భారత వైద్య పరిశోధన మండలి సూచించింది.
Also Read : కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు.. కేంద్రం హెచ్చరిక