Jahangirpuri Demolitions: జహంగీర్ పురి కూల్చివేతలపై తాము జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కూల్చివేతలపై దాఖలైన వివిధ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం తోసిపుచ్చింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. యథాతథాస్థితిని పాటించాలని ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నత న్యాయస్థానాన్ని జమైత్ ఉలామా ఇ హింద్ సంస్థ ఆశ్రయించింది. కనీసం నోటీసులు ఇవ్వలేదని, జవాబిచ్చేందుకు 10 రోజలు వ్యవధి కూడా ఇవ్వలేదని వాదనలు వినిపించారు పిటిషనర్ తరఫు న్యాయవాది దవే. తదుపరి విచారణ చేపట్టే వరకు స్టేటస్ కో పాటించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఉత్తర ఢిల్లీ మేయర్, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ కు స్టేటస్ కో ఉత్తర్వులను అందజేయాలని రిజిష్ట్రార్ ను ధర్మాసనం ఆదేశించింది.
జహంగిర్ పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఫాలో అవుతామన్నారు ఉత్తర ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్. మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన కూల్చివేతలను ఆపుతామన్నారు. గత వారం హింసాత్మక ఘటనలు జరిగిన ఢిల్లీలోని జహంగీర్ పురిలో బుల్ డోజర్లతో అక్రమంగా నిర్మించిన కట్టడాలు కూల్చివేస్తున్నారు. జహంగీర్ పురిలో ఈనెల 16న హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తుండగా హింస చెలరేగింది. అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. దీంతో.. మరుసటి రోజు నుంచే ఆ ప్రాంతంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : విద్యార్ధి నాయకుడికి సుప్రీంకోర్టు వార్నింగ్