Be alert: డ్రగ్స్ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటులేదని, ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తే వెంటనే దాని మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్ళతో పెకలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, చీకటి ప్రపంచంలో వ్యవహారాలను సమూలంగా నిర్మూలించాలని సూచించారు. హోంశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
- అవినీతి నిరోధం, ‘దిశ’ అమలు, ఎస్ఈబీ కార్యకలాపాలు ప్రభుత్వానికి ప్రాధాన్యతా అంశాలు
- సోషల్ మీడియాధ్వారా వేధింపులను అడ్డుకోవడంపై దృష్టి పెట్టాలి
- ప్రతి హోంమంత్రి, డీజీపీలకు విధినిర్వహణలో తమదైన ముద్ర ఉండాలి, ఇది వారికి గర్వకారణంగా నిలుస్తుంది
- అవినీతి నిరోధానికి ఏసీబీలో 14400 నంబర్ పెట్టాం. దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలి.
- అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదు. ఏసీబీకి ఇది ప్రాథమిక విధి కావాలి
- ఆడియో, వీడియో రికార్డింగ్ సాక్ష్యాలున్నా వాటిని ఏసీబీ నెంబరుకు చేరవేసే ఏర్పాటు ఉండాలి.
- గ్రామ, వార్డు సచివాలయాలు అవినీతికి దూరంగా ఉన్నాయి. భవిష్యత్తులోకూడా ఈ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలు కనిపించకూడదు.
- అవినీతి జరుగుతున్నట్టుగా ఆడియో రికార్డ్ ఉన్నా, దాన్ని పంపించినా సరే.. చర్యలు తీసుకునేట్టుగా వ్యవస్థ ఉండాలి.
- మండలస్థాయి వరకూ కూడా ఏసీబీని బలోపేతం చేయాలి:
- అవినీతి నిరోధం, దిశ, ఎస్ఈబీ.. ఈమూడు అంశాలకు సంబంధించి మండలస్థాయిల్లో స్టేషన్లు ఉండాలి, ఈ మూడు అంశాలను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉండాలి
- దిశమాదిరిగా అవినీతి నిరోధానికి ఒక యాప్‌ను పెట్టాలి
- నెలరోజుల్లోగా యాప్‌ను తయారుచేయాలి, కార్యాచరణ కూడా సిద్ధంచేయాలి
- దీనిద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, తమ వద్దనున్న ఆడియో, వీడియో సహా పత్రాలను నేరుగా అప్లోడ్ చేయొచ్చు
- వీటిని నిర్ధారించడానికి అధునాతన ఫోరెన్సిక్ వ్యవస్థలు కూడా ఉండాలి
- లంచాల కేసుల్లో అరెస్టయిన వారికి వేగంగా శిక్షలు కూడా పడాలి
- ప్రస్తుతం ఉన్న చట్టాలను కూడా పరిశీలించి, మార్పులు, చేర్పులు ఉంటే చేసి సమర్థవంతంగా అమలు చేయాలి
- ప్రభుత్వ పథకాల్లో అవినీతిపైన వచ్చిన ఫిర్యాదులపైనా ఏసీబీ దృష్టిపెట్టాలి
- సంబంధిత శాఖలు ఆ ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను ఏసీబీ పర్యవేక్షించాలి
- దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏసీబీ మధ్య సినర్జీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి
- ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సిన నంబర్‌ను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బాగా కనిపించేలా హోర్డింగ్స్ పెట్టాలి
- యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయొచ్చు.. అన్నదానిపై తగిన సూచనలు కూడా ఈ హోర్డింగ్‌లో ఉండాలి
స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పై….
- మద్యం అక్రమ రవాణా, అక్రమ మద్యం తయారీని ఉక్కుపాదంతో అణిచివేయాలి
- ఎస్‌ఈబీకోసం కూడా ఒక కాల్‌సెంటర్ నంబర్‌ను పెట్టాలి
- మద్యం అక్రమరవాణా, అక్రమ మద్యం తయారీలను ఉక్కుపాదంతో అణచివేయాలి
- ఆధునిక నాగరికత పేరుతో వస్తున్న పెడధోరణులకు అడ్డుకట్టవేయాలి
- డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిరోధించాలి, విద్యాసంస్థలమీద పూర్తిగా నిఘా పెట్టాలి
- జూనియర్ కళాశాలలు మొదలుకుని, ఇంజనీరింగ్, డిగ్రీ, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు మీద ఫోకస్ పెట్టాలి
- మన పిల్లలు వీటి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది
- ఎక్కడ ఏం జరిగినా… మనకు వెంటనే సమాచారం వచ్చేలా అందుకు తగ్గ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి
- కాలేజీ స్థాయి వరకు ఇన్ఫార్మర్ వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవాలి, ఏ సమాచారం వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి
- మన పిల్లల్ని, మన విద్యావ్యవస్థలను మనం కాపాడుకోవాలి, అలా చేయకపోతే భవిష్యత్ తరం ఫెయిలవుతుంది
- వారికి మంచి భవిష్యత్తును అందించే వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనది
- ఒకరి జీవితాలను, కొన్నికుటుంబాలను నాశనంచేసే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదు
- పోలీసులు అత్యంత సమర్థవంతంగా వ్యవహరించాలి
- నేను పేర్కొన్న అంశాల్లో ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటో మదింపు చేయండి
- ప్రతినెలా నాతో జరిగే సమావేశంలో మళ్లీ ఏ స్థాయిలో మెరుగుపడ్డామో బేరీజు వేసి నివేదిక ఇవ్వండి
- ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించి సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి
- గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసుకు కూడా దిశ, ఎస్ఈబీ, ఏసీబీ ఈ మూడింటి కార్యకలాపాలపైనా అవగాహన కల్పించాలి
- యాప్స్ వినియోగంపై అవగాహన కల్పించాలి
- దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి సలహాలు, సూచనలను నోటిఫికేషన్స్ రూపంలో పంపాలి
- దీనివల్ల ఘటన జరగ్గానే యాప్‌ను చురుగ్గా వాడుకునేలా సిద్ధంగా ఉంటారు
- నేరనిర్ధాణకు అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ వ్యవస్థలను బలోపేతం చేయాలి
- అవసరమైన వాటిని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
‘దిశ’పై….
- ఇది మునుపెన్నడూ జరగనటువంటి కార్యక్రమం, హోంమంత్రి, డీజీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి
- ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి బాలిక, మహిళ చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. భద్రతకు భరోసా లభించినట్లే
- ఎస్ఓఎస్ బటన్ నొక్కినా ఫోన్‌ను 5 సార్లు అటూ, ఇటూ ఊపితే చాలు 10–15 నిమిషాల్లో పోలీసులు ఉంటారు
- ఈ రెస్పాన్స్ టైంను ఇంకా తగ్గించడంతో పాటు కచ్చితంగా వారికి సహాయం అందాలి
- ఎంత వేగంగా ఘటనా స్ధలానికి చేరగలిగితే అంతే వేగంగా నేరాన్ని నివారించగలుగుతాం
- దీనివల్ల మహిళలు, బాధితులకు భద్రతకల్పించే విషయంలో గొప్ప మార్పు వస్తుంది
- దిశను మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి మరింత మెరుగైన ప్రోటోకాల్స్ రూపొందించాలి:
- ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఏం కావాలన్నా చేయడానికి సిద్ధం
- ఇంతవరకు 1.24 కోట్ల దిశ యాప్ డౌన్లోడ్స్ అయ్యాయి
- మన లక్ష్యం.. నేరాన్ని నివారించడమే కాదు, ఆ క్రైమ్ చేసిన వ్యక్తికి శిక్ష విధించడం
- ఈ మొత్తం ప్రక్రియలో వ్యవస్ధ అత్యంత సమర్ధవంతంగా పనిచేయాలి
- ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను బలోపేతం చేసేదిశగా చేసే ఎలాంటి ప్రతిపాదనలను అయినా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది
ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్ల నియామకం