Friday, October 18, 2024
Homeస్పోర్ట్స్డబ్ల్యూటిసి విజేతకు రూ. 11 కోట్ల ప్రైజ్ మనీ

డబ్ల్యూటిసి విజేతకు రూ. 11 కోట్ల ప్రైజ్ మనీ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటిసి) విజేతకు 1.6 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీని (11 కోట్ల 71లక్షల రూపాయలు) ఐసిసి ప్రకటించింది. ఇండియా- న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ లో జూన్ 18 నుంచి 22 వరకూ డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇప్పటికే రెండు జట్లూ ఇంగ్లాండ్ చేరుకున్నాయి, న్యూజిలాండ్ జట్టు ఇండియా కంటే ముందుగానే  అక్కడకు చేరుకొని ఇంగ్లాండ్ తో రెండు టెస్టుమ్యాచ్ లు ఆడి సిరీస్ ను 1-0 తేడాతో గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఇండియా జట్టు కూడా అటు బౌలింగ్, బాటింగ్ విభాగంలో పటిష్ట లైనప్ తో ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది.

ఇది తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ పోరు కావడం విశేషం, ఇకపై ప్రతి రెండేళ్లకోసారి ఈ ఛాంపియన్ షిప్ ను నిర్వహించాలని ఐసిసి నిర్ణయించింది. మొత్తం 9 దేశాలు ఈ పోరులో ఆడేందుకు అర్హత సంపాదించాయి.

రన్నర్ గా నిలిచిన జట్టుకు 0.8 మిలియన్ అమెరికన్ డాలర్లు (5 కోట్ల 85 లక్షల రూపాయలు)  ప్రైజ్ మనీ అందజేస్తారు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా 4,50,000; 3,00,000; 2,00,000 అమెరికన్ డాలర్ల చొప్పున ఇస్తారు. మిగిలిన నాలుగు జట్లకు ఒక లక్ష డాలర్లు ప్రైజ్ మనీ అందిస్తారు.  ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచిన జట్టుకు ఇప్పటివరకూ ఇస్తూ వచ్చిన ట్రోఫీని ఇకపై టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతకు అందిస్తారు.

విరాట్ కోహ్లి నేతృత్వంలోని ఇండియా జట్టు మూడురోజుల క్వారంటైన్ తరువాత ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ తొలి టైటిల్ ను కోహ్లి సేన గెలుస్తుందా లేక విలియమ్సన్ జట్టు గెలుస్తుందో వేచి చూద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్