Jahangirpuri Demolitions : జహంగీర్ పురి కూల్చివేత వ్యవహారంలో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది సుప్రీం కోర్టు . తదుపరి ఆదేశాలు వచ్చేవరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. కేసులోని ప్రతి వాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్లు జారీ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది సుప్రీం. ఆదేశాలిచ్చిన తర్వాత కూడా NDMC కూల్చివేతలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది సుప్రీం ధర్మాసనం. బాధితుల తరఫున కపిల్ సిబాల్, దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. దీనికి జమియత్ ఉలేమా ఇ హింద్ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది.
దేశంలో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు పెద్ద సమస్య అనీ.. ముస్లింలు మాత్రమే ఆక్రమణలకు కారకులుగా చూపిస్తున్నారన్నారు లాయర్ కపిల్ సిబల్. దేశంలో ఎక్కడ ఘర్షణలు జరిగినా… ఒక వర్గం ప్రజల నివాసాలనే టార్గెట్ చేస్తున్నారన్నారు. దేశంలో మరికొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. కూల్చివేతలను రాజకీయాంశంగా మారకూడదన్నారు. కూల్చివేతలపై స్టే విధించాలన్న కపిల్ సిబాల్ వాదనలు తోసిపుచ్చిన సుప్రీం కోర్టు… కూల్చివేతలపై స్టే విధించే ప్రసక్తే లేదని ధర్మాసనం తెలిపింది.
బాధితుల తరుపున మరో సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఢిల్లీలో 730కి పైగా కాలనీలు ఉన్నాయని… వాటిలో 50 లక్షల మందికి పైగా నివసిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటిలో ఒకే వర్గం ప్రజలు నివసించే ప్రాంతాలనే టార్గెట్ చేస్తున్నారన్నారు. కూల్చివేతలు చేపట్టాలంటే.. సైనిక్ ఫామ్స్, గోల్ఫ్ లింక్స్ కి రావాలని.. అక్కడ ప్రతి రెండో ఇల్లు అక్రమ కట్టడమే అని అన్నారు దుష్యంత్ దవే. పోలీసులు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కోర్టు ప్రారంభం కాకముందే కావాలని కూల్చివేతలు చేపట్టారన్నారు దుష్యంత్ దవే. బీజేపీ నేతలు NDMC కి లేఖ రాయడంతోనే కూల్చివేతలు చేపట్టారని ఆరోపించారు దుష్యంత్ దవే.
Also Read : జహంగీర్ పురి కూల్చివేతలపై సుప్రీం జోక్యం