Zero Vaddi runaalu: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. మహిళా సంఘాలకు వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని అయన ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9.76 లక్షల పొదుపు సంఘాలకు మూడో విడత సున్నావడ్డీ డబ్బులు అందజేయనున్నారు. రాష్ట్ర దాదాపు కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. నేడు 1,261 కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ 2,354.22 కోట్లు జమ చేశారు. నేడు మూడో విడత నిధులను విడుదల చేయనున్నారు.
దీనితో పాటుగా గత 34 నెలల కాలంలో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా 71,673.69 కోట్ల రూపాయలను రుణాలుగా ఇప్పించారు. మహిళా సంఘాల అక్కచెల్లెమ్మలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు, కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు ఈ రుణాలు ఉపయోగపడ్డాయి. తద్వారా వారి ఆర్ధిక స్వావలంబనకు ఈ పథకం దోహదం చేసింది.
కార్యక్రమంలో భాగంగా ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వైఎస్సార్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి విజయవాడ చేరుకొని బందర్ రోడ్‌లోని రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి వెళ్ళి, వారి కుటుంబంలో ఇటీవల వివాహం అయిన నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Also Read : డ్రగ్స్ పై ఉక్కుపాదం: సిఎం ఆదేశం