Saturday, November 23, 2024
HomeTrending Newsసున్నీల రక్త దాహానికి అమాయకుల బలి

సున్నీల రక్త దాహానికి అమాయకుల బలి

 Sunni Shia Clashes : ఆఫ్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. సున్నీ జిహాదీలు మైనారిటీ షియా వర్గానికి చెందినవారిపై దాడులకు తెగబడ్డారు. శుక్రవారం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ  మసీదు, పాఠశాలలో ప్రార్థనల సమయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో  పిల్లలతో సహా 33 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 43 మందికి గాయాలయ్యాయని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. ఇసీస్ (ఐఎస్ఐఎస్) గ్రూపు రెండు వేర్వేరు ఘోరమైన దాడులకు పాల్ప‌డిన త‌రువాత రోజు ఈ దాడులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.  ఉత్తర ప్రావిన్స్‌లోని  కుందుజ్ లో ఇమామ్ సాహెబ్ పట్టణంలో ఈ ఘటన జరిగిందని జబీహుల్లా ముజాహిద్ ట్వీట్​ చేశారు.

దాదాపు డజను అంబులెన్స్‌లు తీవ్రంగా గాయపడిన వారిని కుందుజ్ నగరంలోని ప్రధాన ప్రాంతీయ ఆసుపత్రికి తరలించాయి. గాయపడిన వారి శరీరాలపై ఉన్న ష్రాప్నెల్ గాయాలు భారీ బాంబు పేలుడు   సంభవించినట్లు చూపిస్తున్నాయని ప్రావిన్షియల్ ఆసుపత్రిలోని వైద్యుడు చెప్పారు. మరో ఘటనలో ఉత్తర మజర్-ఇ-షరీఫ్​​లోని మసీదుపై కూడా బాంబు దాడికి జ‌రిగింది. ఈ బాంబు పేలుడులో 10 మంది మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ దాడుల‌కు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉంది. ఇలాంటి దాడులు ఎక్కువ‌గా.. ఐసిస్​ చేస్తుందని, ఈ దాడుల్లో కూడా ఐసిస్ పాత్రే ఉన్నట్లు అనుమానిస్తున్నారు.  ప్రజా ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత తాలిబాన్ గత సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్‌పై నియంత్రణ సాధించిన్నప్పటి నుండి, బాంబు దాడుల సంఖ్య తగ్గింది. అయితే సున్నీ జిహాదీలు మైనారిటీలపై దాడులు చేయటం,పెరిగింది. షియా పరిసరాల్లోని పాఠశాల, మసీదును లక్ష్యంగా చేసుకుని ఘోరమైన దాడులతో, ఈ వారంలో వరుస బాంబు దాడులు దేశాన్ని కదిలించాయి.

ISIS వంటి జిహాదిస్ట్ గ్రూపులు సూఫీల పట్ల తీవ్ర ద్వేషాన్ని కలిగి ఉంటారు. గత ఏడాది ఆగస్టు 15న తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత శుక్రవారం నాటి పేలుడు అతిపెద్ద దాడుల్లో ఒకటి. అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే.. కాబూల్ విమానాశ్రయంలో పదివేల మంది దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆత్మాహుతి దాడిలో 100 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు, 13 మంది US సైనికులు మరణించారు. ఆ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ ప్రకటించింది.

Also Read : కాబుల్ పాఠశాలల్లో పేలుళ్లు, 25 మంది మృతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్