Saturday, November 23, 2024
HomeTrending Newsవిపక్ష పాలనలోని రాష్ట్రాలు టార్గెట్ గా మోడీ విమర్శలు

విపక్ష పాలనలోని రాష్ట్రాలు టార్గెట్ గా మోడీ విమర్శలు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ  స్పందిస్తూ విపక్ష పార్టీలను టార్గెట్ చేశారు. కొన్ని రాష్ట్రాల వల్లే పెట్రో ధరలు ఇబ్బందికరంగా ఉన్నాయని విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలను తప్పుపట్టారు. దేశంలో కోవిడ్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గత నవంబర్‌లో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఇంధన ధరలు తగ్గుతాయని చెప్పారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలు ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థించారు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంధన ధరలను ప్రస్తావిస్తూ.. వ్యాట్‌ను తగ్గించిన రాష్ట్రాల్లో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కేంద్రం అభ్యర్థించిందని చెప్పారు. ‘‘నేను ఎవరినీ విమర్శించడం లేదు.. కేవలం చర్చిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి చెప్పారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనాలు అందించాలని అభ్యర్థిస్తున్నట్టుగా చెప్పారు.

‘‘మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. పౌరులపై భారం తగ్గించడానికి కేంద్రం గత నవంబర్‌లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పన్నులు తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని మేము రాష్ట్రాలను అభ్యర్థించాము. కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించాయి.. కానీ కొన్ని రాష్ట్రాలు అలా చేయకపోవడం వల్ల అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. దీని వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు అధికంగానే కొనసాగుతున్నాయి. ఇది ఒకరకంగా ఆ రాష్ట్రాల ప్రజలకు అన్యాయం మాత్రమే కాదు.. పొరుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Also Read : రుయా ఘటనలు మళ్ళీ జరగొద్దు: సిఎం ఆదేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్