Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఆసియా బ్యాడ్మింటన్: సింధు, సైనా, శ్రీకాంత్  గెలుపు

ఆసియా బ్యాడ్మింటన్: సింధు, సైనా, శ్రీకాంత్  గెలుపు

Singles won: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ రెండో రోజు ఫలితాల్లో  ఇండియాకు సింగిల్స్ లో ఊరట దక్కగా, డబుల్స్  విభాగంలో తీవ్ర నిరాశ ఎదురైంది.  స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు చెమటోడ్చి విజయం సాధించి రెండో రౌండ్లో అడుగు పెటింది. 39 ర్యాంకులో ఉన్న  చైనా తైపీ క్రీడాకారిణి పై యు పో తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో ఎట్టకేలకు  విజయం సింధును వరించింది, 18-21 తో తొలి సెట్ కోల్పోయిన సింధు రెండో సెట్ ను అతి కష్టం మీద 27-25 తో గెల్చుకుంది. మూడో సెట్ లో మాత్రం  సింధు తన సత్తా చాటి 21-9 తో ప్రత్యర్థిని మట్టి కరిపించింది.

కిడాంబి శ్రీకాంత్  సైతం హోరాహోరీ పోరులో విజయం దక్కించుకున్నాడు.

మహిళల సింగిల్స్ లో…

  • పివి సింధు 18-21; 27-25; 21-9తో పై యు మీద విజయం సాధించింది,
  • సైనా నెహ్వాల్ 21-15; 17-21;21-13 తో కొరియా క్రీడాకారిణి సిం యుజిన్ ను ఓడించింది.
  • ఆకర్షి కశ్యప్ జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో 21-15; 21-9తేడాతో ఓటమి పాలైంది
  • సింగపూర్ క్రీడాకారిణి యేవో జియా మిన్ చేతిలో 9-21; 21-17;26-24 తో మాళవిక బన్సోద్ ఓటమి పాలైంది. తొలి సెట్ అవలీలగా గెల్చుకున్న మాల్విక  తర్వాతి రెండు సెట్లల్లో హోరాహోరీ తపలడినా చివరకు పరాజయం తప్పలేదు.

మహిళల డబుల్స్ లో…

  • అశ్వని భట్- శిఖా గౌతమ్ జోడీ 21-19; 21-12 తేడాతో మలేషియా ద్వయం అన్నా చింగ్- మీ జింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు
  • సిమ్రాన్ సింఘి-రితికా జోడీ 21-15; 21-11తో మలేషియా జోడీ చేతిలో ఓటమి పాలయ్యారు.

పురుషుల సింగిల్స్ లో…

  • కిడాంబి శ్రీకాంత్ 22-20; 21-15 తో మలేషియా ఆటగాడు జె యంగ్ పై గెలుపొందాడు.
  • చైనా ఆటగాడు లి షి ఫెంగ్ చేతిలో 12-21; 21-10;21-19 తేడాతో లక్ష్య సేన్ ఓడిపోయాడు
  • సాయి ప్రణీత్ 21-17;21-13తో ఇండోనేషియా ఆటగాడు జోనాటన్ క్రిస్టీ చేతిలో ఓటమి చెందాడు

Also Read ఆసియా కప్ బ్యాడ్మింటన్: డబుల్స్ లో రెండు విజయాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్