Saturday, November 23, 2024
HomeTrending Newsఅగ్నిప్రమాద బాధితులకు పునరావాసం

అగ్నిప్రమాద బాధితులకు పునరావాసం

ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై 21 గుడిసెలు దగ్ధం అయి 40 కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ వెంటనే వారికి పునరావాస చర్యలు చేపట్టి, నష్ట పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. గుడిసెలు కాలిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి, వెంటనే స్పందించడంతో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టగలిగామన్నారు. నేడు వారిని ఆదుకోవడంపై అధికారులతో చర్చించారు.

గిరిజన సంక్షేమ శాఖ నుంచి 40 కుటుంబాలకు 25వేల రూపాయల చొప్పున వెంటనే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి నష్టపోయిన కుటుంబాలకు 15వేల రూపాయల నష్టపరిహారం, 25 కిలోల బియ్యం, 1800 రూపాయల విలువైన 12 వస్తువుల వంట సామాగ్రి కిట్ అందిస్తున్నట్లు తెలిపారు.

అగ్ని ప్రమాదంలో గుడిసెలు పూర్తిగా కాలిపోవడంతో వారు కుదటపడే వరకు ప్రభుత్వమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వారికి అన్ని వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు కార్యదర్శులు, కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని వారికి ధీమా కల్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్