విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప సినిమాని మే 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా ఆగింది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఇటీవల నారప్ప మిగిలిన ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. మరో వారం రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ కానుందని సమాచారం. మరి.. నారప్ప ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడు అంటే.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ కానున్నాయి. అయితే… నిర్మాతలు 100 శాతం ఆక్యుపెన్సీ కోసం ఎదురు చూస్తున్నారు. జులై రెండో వారంలో.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ కావచ్చు అని అంటున్నారు.
100 శాతం ఆక్యుపెన్సీకి ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు నారప్ప చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీగా ఉన్నారని తెలిసింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ కానున్న పెద్ద సినిమా నారప్ప అవుతుంది అంటున్నారు. వెంకటేష్ నటించిన మరో చిత్రం దృశ్యం 2. మలయాళ రీమేక్ అయిన దృశ్యం 2 కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మరి.. ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చేస్తారో..? లేక ఓటీటీలోనే రిలీజ్ చేస్తారో తెలియాల్సివుంది.