రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో ప్రొక్టర్ అండ్ గాంబిల్ లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో పాటు పీ అండ్ జీ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 200 కోట్ల పైచిలుకు రూపాయాలతో ఈ కంపెనీని ప్రారంభం చేసుకున్నామని తెలిపారు. ఫ్యూచర్ అంతా లిక్విడ్ డిటర్జెంట్స్ అని పీ అండ్ జీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో పీ అండ్ జీ శిక్షణ ద్వారా తెలంగాణలోని అన్ని వర్గాలకు మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. లింగ సమానత్వం కోసం పీ అండ్ జీ చేస్తున్న కృషి ఎంతో ఆకట్టుకుందన్నారు. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ఆరేండ్ల కాలంలో రాష్ట్రంలో పీ అండ్ జీ తన కార్యకలాపాలను విస్తరించిందని తెలిపారు. తెలంగాణకు నిరంతరం మద్దతు తెలుపాలని కోరుకుంటున్నామని కేటీఆర్ చెప్పారు.
Also Read : రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్ కు శంకుస్థాపన