Ebola Cases : ఆఫ్రికా ఖండంలో ఎబోలా మళ్ళీ వ్యాపిస్తోంది. కాంగో దేశంలో ఈశాన్య ప్రాంతమైన ఈక్వేటార్ రాష్ట్రంలోని మబండక పట్టణంలో తాజాగా ఎబోలా కేసు వెలుగు చూసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) ద్రువీకరించింది. గత నెల ఏప్రిల్ 21వ తేదిన ఇద్దరు వ్యక్తులు ఎబోలాతో చనిపోగా ఏప్రిల్ 27 నాటికి ఆ ప్రాంతంలో 267 కేసులు నమోదయ్యాయి. అధికారిక లెక్కలే ఈ విధంగా ఉంటే అనధికారికంగా ఇంకా ఎక్కువ కేసులు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు అంటున్నారు.
కాంగోలో ఎబోలా మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉండటంతో పొరుగు దేశమైన టాంజానియా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కాంగో నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించి, ప్రత్యేక వైద్య బృందాలను కాంగో సరిహద్దుల్లో ఏర్పాటు చేశారు. ఎబోలా అంటువ్యాధి కాదు. ఎబోలా అనేది వైరస్ వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వ్యక్తి బ్రతకడం అంత సులభం కాదు. ఇది అంటువ్యాధి కాదు, గాలి ద్వారా సోకదు. వైరస్ సోకిన వ్యక్తిని తాకడం ద్వారా కూడా ఇది ఇతరులకు సోకదు.
ఇది ముఖ్యంగా జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది సహజంగా గబ్బిలాలకు సంక్రమించే వ్యాధి. వ్యాధి సోకిన జంతువుల రక్తం లేదా స్రావాల ద్వారా మరొకరికి అంటుకుంటుంది. చనిపోయిన చింపాంజీలు, గొరిల్లాలు, గబ్బిలాలు, కోతులు, దుషి, ముచ్చపంది వంటి జంతువులను ముట్టుకుంటే వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకినపుడు జ్వరంతో పాటు, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్రపిండాలు, కాలేయం వనిచేయకపోవటం జరుగుతుంది. రక్తస్రావం, తెల్లరక్త కణాలు, ప్లేట్లెట్లు పడిపోవడం సర్వసాధారణం. వైరస్ సోకిన రెండు రోజుల నుండి 21 రోజుల్లో వ్యాధి బయటపడుతుంది. ఎబోలా వైరస్ వ్యాధికి ప్రత్యేకంగా మందులుగాని, వ్యాక్సిన్లు గాని లేవు. అందుకే ప్రపంచ ఆరోగ్యసంస్థ అన్ని రకాల వ్యాక్సిన్లు ఈ వ్యాధి నివారణకు వాడవచ్చునని అనుమతించింది. ఎబోలా వైరస్ రోగనిరోధకతను నిర్వీర్యం చేసి రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బ తీస్తుంది.
Also Read : వేగంగా వ్యాపిస్తున్న కరోనా