గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట దవాఖానలో మోకాలి చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి సూచించారు. డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే చేసుకునే మోకాలి చిప్పల మార్పిడి నేడు ప్రభుత్వ దవాఖానల్లో పేద వాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు.
సీఎం కేసీఆర్ కన్న కలలు నేడు నిజమవుతున్నాయని మంత్రి తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు అయితే నేడు 56 శాతం అవుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లనే మోకాలు చిప్పల సర్జరీలు సాధ్యం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సర్జరీలకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగానే ఈ సేవలు పొందవచ్చని మంత్రి తెలిపారు
Also Read : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమిపూజ