Wednesday, November 27, 2024
HomeTrending Newsఇండో ఫసిఫిక్ లో ఉద్రిక్తతలపై ఆందోళన

ఇండో ఫసిఫిక్ లో ఉద్రిక్తతలపై ఆందోళన

Indo Pacific Region : ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థాపనకు ఫ్రాన్స్- ఇండియాలు కలిసి కట్టుగా కృషి చేయాలని రెండు దేశాలు ప్రకటించాయి. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ చట్టాల సంరక్షణ, ప్రాదేశిక జలాలు, దేశాల సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా దురాక్రమణలు, ఉద్రిక్తతలకు తావులేకుండా పనిచేయాలని ప్రధాని మోడీ – అధ్యక్షుడు మేక్రాన్ సంయుక్తంగా ప్రకటించారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ న్యాయసుత్రాల ఉల్లఘన పెరిగిందని ఇండియా-ఫ్రాన్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యూరప్​ పర్యటనలో భాగంగా చివరి రోజు ప్రధాని మోడీ పారిస్​ చేరుకున్నారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్​గా వారం క్రితమే ఇమ్మాన్యుయెల్​ మేక్రాన్​ మళ్లీ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మేక్రాన్​కు మోడీ అభినందనలు తెలిపారు. ఇండియా, ఫ్రాన్స్​ల బంధం చాలా బలమైందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

అంతకుముందు కోపెన్​హేగన్​లో ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్​ ఆన్​ డిజాస్టర్​ రెసిలియంట్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ నాలుగో ఎడిషన్​ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రసంగించారు. ‘మౌలిక సదుపాయాలు అంటే ఆస్తులను కూడబెట్టడం, పెట్టుబడులపై దీర్ఘకాలంలో ఆదాయాన్ని సృష్టించడం కాదు. మౌలిక సదుపాయాల వృద్ధిలో ప్రజలు ఆత్మలాంటి వారు. వారికి నాణ్యమైన, ఆధారపడదగిన సేవలు అందించడమే వీటి ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఇండియా చేస్తున్నది ఇదే’ అని మోడీ అన్నారు. 2070 నాటికి నెట్​ జీరో దిశగా అడుగులు వేస్తామని కోప్ –26లో అంగీకరించడానికి కూడా ఇదే కారణమని చెప్పారు. రెండున్నరేండ్ల కాలంలోనే విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల కూటమి కీలక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ సెషన్​లో ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు, మడగాస్కర్​ ప్రెసిడెంట్ తదితరులు కూడా మాట్లాడారు.

మూడు రోజుల యూరోప్ పర్యటన ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు భారత్ చేరుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్న ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితం వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Also Read : సాంస్కృతిక వైవిధ్యమే భారతీయుల బలం – ప్రధాని మోడీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్