జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… ముంబైలో ఎంతో బిజీగా ఉన్నా మా ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన అడవి శేష్ కు ధన్యవాదాలు. అలాగే మాకెంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఫ్యామిలీలా అంతా కలిసి చేశాం. పవన్ చెప్పినట్లు మాకు సినిమానే లోకం. ఈ సినిమానే ఆశ, శ్వాసగా జీవిస్తున్నాం. సినిమా తప్ప మాకు ఏమీ తెలియదు. ఇందులోనే మేము చాలా పొగొట్టుకున్నాం. ఇంతకు ముందు నేను చేసిన సినిమాల కంటే ఈ సినిమాకు ఎక్కువ టెన్షన్. ఎందుకంటే ఈ సినిమాకు దర్శకురాలిగా కూడా పని చేశాను.
ఉమెన్స్ ఎక్కువగా వర్క్ చేసినా కూడా ఎక్కువ మంది ఎంకరేజ్ చెయ్యారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఓటిటి లకు అలవాటు పడ్డారు పెద్ద బడ్జెట్ సినిమాలన మాత్రమే చూస్తారు అని చాలా మంది చెప్పారు.అయితే ఇప్పుడు మేము తీసిన ఈ సినిమా ఫ్యామిలీ అందరికి కచ్చితంగా నచ్చుతుంది. ఇంతకు ముందు వచ్చిన రాజశేఖర్ గారి అక్క మొగుడు, సింహరాశి, గోరింటాకు, సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా అలరించాయో ఇప్పుడు వస్తున్న “శేఖర్ ” సినిమా కూడా అంతే ఎమోషన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎమోషనల్ గా అవుతారు. ఈ సినిమా పూర్తి కావడానికి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఎంతో కష్టపడి, ఇష్టంగా చేశారు వారందరికీ నా ధన్యవాదాలు.మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని అన్నారు
హీరో రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్టార్ట్ అయి నప్పుడు నేను కోవిడ్ వల్ల సిక్ అయ్యి చాలా సీరియస్ గా ఉండి మళ్ళీ మీ అందరి ప్రేమ వల్ల బతికి బయటపడ్డాను. అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ ప్రే చేసి నన్ను బతికించింది ఈ సినిమా కోసమే. దర్శకుడు పవన్ చెప్పినట్లు సినిమా అంటే మాకు ప్రాణం.ఈ సినిమాను మేమంతా ప్రాణం పెట్టి తీశాం. ముందు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలను కున్నాము కానీ కొన్ని పరిస్థితుల వలన కుదరలేదు. ఇన్ని రోజులకి కుదిరింది. ఈ సినిమాను మే 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మేము ప్రేక్షకులకు చెప్పేది ఒకటే… థియేటర్ వచ్చి సినిమా చూసిన వారు బాగుంది అంటేనే మా సినిమా చూడండి అని చెపుతున్నాం. ఎందుకంటే మాకు ఈ సినిమా పై అంత నమ్మకం ఉంది. మేము పడిన కష్టం ఎలా ఉందో అనేది మీరంతా సినిమా చూస్తే తెలుస్తుంది అన్నారు.
Also Read : మాపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు : జీవితా రాజశేఖర్