Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్హైదరాబాద్ కు హ్యాట్రిక్ ఓటమి

హైదరాబాద్ కు హ్యాట్రిక్ ఓటమి

SRH Again lost: హైదరాబాద్ ఆట తీరు మరోసారి గాడి తప్పింది. ఆరంభంలో రెండు ఓటములు ఎదుర్కొని, ఆ తర్వాత వరుసగా ఐదు విజయాలతో అభిమానులను ఆకట్టుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్-92 (58 బంతుల్లో 12 ఫోర్లు, 3సిక్సర్లు); రోమాన్ పావెల్-67 (35 బంతుల్లో 3ఫోర్లు, 6సిక్సర్లు) నాలుగో వికెట్ కు అజేయమైన 122 పరుగులు జోడించడంతో ఢిల్లీ 207 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగలిగింది.

ముంబై లోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పరుగుల ఖాతా తెరవకముందే ఢిల్లీ తొలి వికెట్ (మన్ దీప్ సింగ్- డకౌట్), 37 పరుగుల వద్ద రెండో వికెట్ (మిచెల్ మార్ష్-10) వికెట్ కోల్పోయింది. మూడో వికెట్ కు డేవిడ్ వార్నర్- కెప్టెన్ రిషభ్ పంత్ లు ధాటిగా రాణించి 48 పరుగులు జోడించారు, 16 బంతుల్లో 1ఫోర్, 3 సిక్సర్లతో 26 పరుగులు చేసిన పంత్, శ్రేయాస్ గోపాల్ బౌలింగ్ లో బౌల్డ్అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత వార్నర్-పావెల్ మరో వికెట్ పడకుండా బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లో తొలి ఓవర్లోనే ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో భువి, సీన్ అబ్బార్ట్, శ్రేయాస్ గోపాల్ తలా ఒక వికెట్ సాధించారు,

హైదరాబాద్ 8 పరుగులకే తొలి వికెట్ (అభిషేక్ శర్మ-7); 24వద్ద రెండో వికెట్ (కేన్ విలియమ్సన్-4) కోల్పోయింది. ఇటీవలి కాలంలో రానిస్తోన్న రాహుల్ త్రిపాఠి కూడా 22 పరుగులు చేసి జట్టు స్కోరు 37వద్ద వెనుదిరిగాడు. ఎడెన్ మార్ క్రమ్- నికోలస్ పూరన్ లు నాలుగో వికెట్ కు 60పరుగులు జోడించారు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42  పరుగులు చేసి మంచి ఊపుమీదున్న మార్ క్రమ్ ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేయడంతో సన్ రైజర్స్ ఆశలు నీరుగారాయి. శశాంక్ సింగ్-10, సీన్ ఎబ్బోట్ -7 మాత్రమే చేసి ఔటయ్యారు.    నికోలస్ పూరన్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేసి 18వ ఓవర్లో ఔటయ్యాడు.

ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు, శార్దూల్ ఠాకూర్ రెండు; కుల్డీప్ యాదవ్, నార్త్జ్, మిచెల్ మార్ష్ లు తలా ఒక వికెట్ సాధించారు.

డేవిడ్ వార్నర్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : గుజరాత్ జోరుకు పంజాబ్ బ్రేక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్